Friday, February 20, 2009

అసలప్పుడేమి జరిగిందంటే.....................


"హయ్! అనూ.."

"హాయ్! ` అక్కా బాగున్నావా? ఏంటి విశేషాలు? "

"ఏముంటాయి అంతా మాములే. రోజులలా అలా సాగిపొతున్నాయి నువ్వే ఏమన్నా మంచి విశేషాలు చెప్పు వింటాను".

"మనిద్దరం కలిసి బ్లాగొకటి క్రియేట్ చేసాము గుర్తుందా వారానికొక విషయం రాద్దామనుకొన్నాము మర్చిపోయావా?"

"లేదు గుర్తుంది. మీ బావగారితోను, పిల్లలతోను అసలు కుదరడం లేదు. చెప్పు ఈరోజు ఎటూ ఇటొచ్చాను కదా, రాద్దాము, ఏమి రాద్దాము?"

"ఊ, మీ వారి గురించి రాద్దామా, లేక మా వారి గురించి??..........."

"అబ్బా ఎవ్వరి వార్లు వద్దు కాని హాయిగా మనిద్దరం కలిసి గడిపిన ఆ రోజులు ఆ పోట్లాటలు, సరద సరదా ఆటల గురించి రాద్దాము."

"సరే అక్కా! ఆలోచిస్తున్నా ఉండూ... "

అక్కా మనిద్దరం చిన్నక్కతో కలిసి సినిమాకి వెళ్ళినప్పుడూ....

"ఆ! గుర్తొచ్చింది.. ఆ సంఘటన గురించి రాద్దామా? సరే రాసేద్దాము. అసలయినా ఆరోజు అంతా నీ వల్లే జరిగింది. "

"ఇదిగో అక్కా! నన్నేమన్నా అంటే ఊరుకొనేది లేదు. సినిమాకి వెళ్దామని అడిగిందెవరో ఒకసారి గుర్తు తెచ్చుకో, నువ్వడగకపోతే అలా జరిగి ఉండేది కాదుగా!"

"ఆ! అడగకపోతే జరిగి ఉండేది కాదు ఎంత చక్కగా చెప్తున్నావో! అడగగానే 'వెళ్దాము నాకు తెలుసు ఆ థియేటర్ ' అంటూ ఎందుకనాలో?? గొప్ప కాకపోతే...."

" అవును తెలుసు కాబట్టి అన్నాను తప్పా! ఇప్పటికి అంటాను నాకు ఆ థియేటర్కి దారి తెలుసు, తెలుసు , తెలుసు. "

"ఎహే పోవే! నీతో వితండవాదన నాకెందుకు? అప్పుడు అలాగే గొడవ చేసి పెద్ద తెలిసిందానిలా బయల్దేరావు. "

"ఆ! నువ్వు మటుకు వితండవాదన చెయ్యలేదా ఏంటి ఆరోజు, అసలు నీకు 'ఊహ ' అని పేరెవరు పెట్టారో అన్నీ ఊహించేసుకొని , మాట్లాడేస్తావు..."

"నువ్వు చిన్నప్పటినుండి అంతేనే అసలు ముందు మాట అర్థం చేసుకోవు ఏదన్నా అంటే పేరంటావు. సరే ఆరోజసలు ఏమి జరిగిందో చెప్పు ....మనకీ పోట్లాటలు ఎప్పుడు ఉండేవే."

*****

"హయ్! అమ్మా! హయ్ పెద్దమ్మా! "

"ఇప్పుడిక నేనేమి చెప్తాను. పిల్లలు స్కూల్ నుండి వచ్చేసారు" మళ్ళి వారం ఆగాల్సిందే. ఇప్పుడు చెప్పలేకపోడం అంతా నీ వల్లే!"

"అదిగో మళ్ళీ నన్ను అంటావు.. అంతా నీ వల్లే .... "అక్కా! ఆ ఆరోజు జరిగింది చెప్దామ అని అన్నావు.."

" నీ వల్లే"

"కాదు నీ వల్లే"
*******
ఇది తెగేది కాదు కాని, మావల్ల జరిగిందేమిటో వచ్చేవారం చెప్తాము...మీ ఊహ-అనూహ.

7 comments:

  1. బాగుంది మీ లడాయి.పోట్లాటతో అసలు విషయం చెప్పనేలేదు.

    ReplyDelete
  2. బాగానే ఉంది.. మీ అక్కా చెల్లెళ్ళ చిలిపి తగాదాలు..!
    మరి అయితే వచ్చే వారం వరకు వేచి చూడాలన్న మాట..!

    ReplyDelete
  3. idi maree daarunam.chepta ani mottanike eggottesaru.

    ReplyDelete
  4. మీ పోట్లాటతో అసలు విషయం చెప్పనేలేదు.అయితే వచ్చే వారం వరకు వేచి చూడాలన్న మాట..!

    ReplyDelete
  5. బాగు౦ది మీ కలహ స౦భాషణ.నేను,మా చెల్లి కూడా ఇలాగే పోట్లాడుకు౦టా౦ ఇప్పటికీ!కానీ సస్పెన్స్ లో పెట్టేసారుగా మమ్మల్న౦దరినీ తప్పుతు౦దా వేచి చూస్తా౦."ఊహ-అనూహ" పేరు బాగు౦ద౦డీ.

    ReplyDelete
  6. హ హ హ పైన మా అక్క చెప్పినట్లు నిజంగా మా ఇద్దరి పోట్లాట లాగే ఉంది. అవునింతకీ అసలేమి జరిగిందండి?

    ReplyDelete
  7. కామెంట్ తో సహకరించిన అందరికీ వందనాలు. ఏమి జరిగిందో వారం తరువాత తప్పక చెబుతాంగా.

    ReplyDelete